యాదాద్రి భువనగిరి : ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాల మూలంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలేరు నియోజకవర్గంలోని పలు గిరిజన తండాలకు సంబంధించిన బీటీ రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
సంబంధిత గిరిజన తండా రోడ్ల నిర్మాణానికి ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.
గురువారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. రోడ్ల దుస్థితి, సమస్యను సవివరంగా మంత్రికి విన్నవించడంతో నిధుల మంజూరుకు ఆమె సానుకూలంగా స్పందించారని విప్ గొంగిడి తెలిపారు.