Gokulashtami | టీటీడీ గోశాలలో వైభవంగా గోకులాష్టమి గోపూజ
Gokulashtami | గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు.
తిరుపతి : గోకులాష్టమి ( Gokulashtami ) పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ( TTD ) వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర( EO Ravichandra ) గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం ‘ ఓం నమో వేంకటేశాయ’ మహామంత్రాన్ని 7 కోట్ల సార్లు జపించిన జప పుస్తకాలను స్వామివారికి సమర్పించే కార్యక్రమాన్ని ఈవో సందర్శించారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో ప్రభల గోపీనాథ్, గోశాల డైరెక్టర్ శివకుమార్, విజీవో గిరిధర్, ఇన్చార్జి డీఎల్వో వెంకట సుబ్బానాయుడు, భక్తులు పాల్గొన్నారు.
తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

తిరుమల : తిరుమలలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. గోగర్భం డ్యామ్ వద్ద ఉన్న ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శనివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల మధ్య తిరుమలలో ఉట్లోత్సవం కార్యక్రమం ఉంటుందని వివరించారు. శ్రీ మలయప్పస్వామి బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారని వెల్లడించారు. ఈ కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

