Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. రేపు, ఎల్లుండి నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సోమవారం సీఈఓను కలిసి ఉన్న ఇబ్బందులను వివరిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.
Talasani srinivas Yadav | ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కోసం హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 23 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ చాలా తప్పు. గత ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎందుకని చాలా మంది అడుగుతున్నారు..? లేనిపోని ఇబ్బందులు పెట్టి సమస్యలు తీసుకురావడం దురదృష్టకరమన్నారు.
రేపట్నుంచి ఓటర్ల నమోదు ఉధృతంగా తీసుకోవాలని నిర్ణయించామన్నారు. పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. రేపు, ఎల్లుండి నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సోమవారం సీఈఓను కలిసి ఉన్న ఇబ్బందులను వివరిస్తాం
. సీఎం, ప్రభుత్వం సరిగ్గా ఉంటే ఇంత తక్కువగా ఎందుకు ఓటర్ల నమోదు ఎందుకు జరుగుతుంది..? చేతగాని ప్రభుత్వం, పని చేయడం రాదు… అందుకే కరెంట్, నీటి సమస్య ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం సలహాలు అయినా తీసుకోవాలి కదా.. కేసీఆర్ ను తిట్టడం తప్ప ఇంకేమీ లేదన్నారు.
దరిద్రమైన పాలన వచ్చిన తర్వాతే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని తలసాని ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో కేసీఆర్ తీసుకున్న చర్యలను అందరూ ప్రశంసించారు, దేశం గర్వపడేలా చేశారు. కరెంట్, మంచినీరు ఉండదు అని ఇప్పుడు చెప్తున్నారు… ఆర్నెళ్లుగా మేము చెప్తున్నా పట్టించుకోలేదు. భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేరన్న అంశాన్ని గుర్తించాలి. కేసీఆర్ హయాంలో కరెంట్, తాగునీరు, సాగునీరు ఎలా వచ్చిందో ప్రజలు అందరికీ తెలుసు. రైతులు, ప్రజల ఇబ్బందులు గాలికి వదిలేసి బూతు పురాణం అందుకుంటున్నారు.
ఎక్కడైనా ముఖ్యమంత్రి క్షుద్రపూజలు అని మాట్లాడతారా..? బీఆర్ఎస్ అంటే భయం లేకపోతే ప్రతిసారి మా ప్రస్తావన ఎందుకు వస్తోంది. ఇలాగే కాలయాపన చేయండి… రెండేళ్ల తర్వాత ప్రజలు ఇంటికి పంపుతారు. ప్రభుత్వం ఇకనైనా అందరిని సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. తలసానితోపాటు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ,ఎమ్మెల్సీలు వాణీ దేవి ,దాసోజు శ్రవణ్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్లు క్రిశాంక్ ,గజ్జల నగేష్ ,అల్లీ పురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక..
ఎప్పుడూ కేసీఆర్ గారి మీద పడి ఏడుస్తూనే ఉన్నడు.కాంగ్రెస్ దరిద్రపు పాలన వచ్చాకే రాష్ట్రానికి..
ఇంతటి దారుణమైన పరిస్థితి వచ్చింది.ఎల్ నినో గురించి ఏడాది సంది మొత్తుకుంటున్నా..
రేవంత్ రెడ్డి పట్టించుకోలే..
ఇప్పుడేమో నీళ్లు లేవు, కరెంట్ లేదంటూ
చేతకాని మాటలు మాట్లాడుతుండు.– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @YadavTalasani
— BRS Party (@BRSparty) October 24, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

