Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
Nikhil | యువ నటుడు నిఖిల్ కెరీర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'స్వయంభూ' (Swayambhu).
Young Hero Nikhil | యువ నటుడు నిఖిల్ కెరీర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ (Swayambhu). ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం నిఖిల్ తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకోవడంతో పాటు, ప్రత్యేక శిక్షణ తీసుకుని పాత్రకు తగిన మేకోవర్‌పై భారీగా సమయం కేటాయించారు. అత్యున్నత ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సుమారు 150 రోజుల పాటు సాగింది. అయితే రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ, ఈ సినిమా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాకపోవడం సినీ వర్గాల్లోనూ, అభిమానులలోనూ చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ‘స్వయంభూ’ విడుదలకు సంబంధించి గతంలో పలు తేదీలను పరిశీలించినప్పటికీ, వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రానికి అత్యంత కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. భారీ విజువల్స్‌తో కూడిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా, అత్యుత్తమ క్వాలిటీతో ప్రేక్షకులకు అందించాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు.
మరోవైపు, రాబోయే నెలల్లో బాక్సాఫీస్ బరిలో పలు పెద్ద సినిమాలు నిలుస్తుండటంతో ‘స్వయంభూ’ చిత్రానికి సరైన సోలో రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయడం చిత్రబృందానికి కొంత సవాల్‌గా మారింది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, త్వరలోనే చిత్రబృందం సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

