Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Kerala Governor : కేరళ గవర్నర్‌గా ఓం ప్రకాష్ మాథుర్ ప్రమాణ స్వీకారం చేసి ఒక రోజు కూడా గడవక ముందే వివాదంలో చిక్కుకున్నారు. రాజ్‌భవన్‌లో శాకాహార వంటశాల (వెజ్ ఓన్లీ కిచెన్) మాత్రమే ఉండాలంటూ ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది
Kerala Governor : కేరళ గవర్నర్‌గా ఓం ప్రకాష్ మాథుర్ ప్రమాణ స్వీకారం చేసి ఒక రోజు కూడా గడవక ముందే వివాదంలో చిక్కుకున్నారు. గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో శాకాహార వంటశాల (వెజ్ ఓన్లీ కిచెన్) మాత్రమే ఉండాలంటూ ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ, సీపీఎం మండిపడుతున్నాయి. ఓం ప్రకాష్ మాథుర్ కేరళ గవర్నర్‌గా శుక్రవారమే ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు ఆయన తన రాజ్ భవన్లో శాకాహార వంటశాల మాత్రమే ఉండాలంటూ ఆదేశించారు.
మాంసాహారాన్ని వండటం కానీ, వడ్డించడం కానీ చేయకూడదని ఆదేశించారు. అయితే, ఈ నిర్ణయంపై కేరళ కాంగ్రెస్ పార్టీతోపాటు, సీపీఎం, వివిధ కేరళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆహారపు అలవాట్ల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కును హరించేలా గవర్నర్ నిర్ణయం ఉందంటూ విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై కేరళకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కేసే వేణుగోపాల్ స్పందించారు. కేరళ గవర్నర్ వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, అభిరుచుల్ని అందరికీ వర్తించేలా చేయడం సరికాదన్నారు. కేరళకు ఉన్న తీర ప్రాంతం దృష్ట్యా ప్రజలు చేపల్ని ఎక్కువగా తింటారని, భిన్నమైన ఆహార అలవాట్లు కలిగి ఉంటారని అన్నారు.
ప్రజలు తమకు నచ్చింది తినే హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. ప్రజల ఆహారపు అలవాట్లను నిషేధించే చర్యల్ని ఆమోదించబోమన్నారు. గవర్నర్ తన పదవిని ప్రజల హక్కుల రక్షణ కోసం వాడుకోకుండా.. సొంత ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని, ఈ నిర్ణయం ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించడమే అన్నారు. అయితే, ఈ అంశంపై కేరళ రాజ్‌భవన్ వర్గాలు వివరణ ఇచ్చాయి. గవర్నర్ ఆదేశాలు ఆయన కోసం సిద్ధం చేసే ఆహార పదార్థాలకు మాత్రమే వర్తిస్తుందని, కార్యాలయ సిబ్బందికి కాదని వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

