హైదరాబాద్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రక్తదానం అంటే.. జీవన దానమే అని తెలిపారు. రక్తదాతల సేవలు గుర్తించి.. వారిని అభినందించాలని చెప్పారు. కొవిడ్ సంక్షోభం రక్తనిల్వలు, రక్త దానంపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. ప్రస్తుతం రక్త నిల్వలు సరిపడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువతకు రక్తదానంపై అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు.
On the occasion of the #WorldBloodDonorDay glad to be a part of virtual conference with Indian Red Cross Society functionaries of #Telangana.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) June 14, 2021
Heartfelt Congrats to IRCS volunteers for their exemplary work in blood donation and other social services during calamities & pandemic pic.twitter.com/jDCyGnRfD8