జాయింట్ పాస్ చిచ్చు!
“అతడు పేరు ప్రణవ్. ఐటీ ఉద్యోగి. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి నుంచి హైటెక్ సిటీకి రోజు మెట్రో ప్రయాణం చేస్తాడు. అక్కడ్నుంచి 5 కిలో మీటర్ల దూరంలో తన కార్యాలయానికి ఆర్టీసీ బస్సు వినియోగిస్తున్నాడు. సాయంత్రం అదే మాదిరి ప్రయాణంతో ఇంటికి చేరుకుంటాడు.
- ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
- మంత్రి తగ్గిస్తామని హామీ ఇచ్చినా..గిట్టుబాటు కాదని తేల్చిన సంస్థలు
- అధ్యయనం లేకుండా ప్రకటన చేసి పరువు తీసుకున్న సర్కార్
- ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
- మంత్రి తగ్గిస్తామని హామీ ఇచ్చినా.. గిట్టుబాటు కాదని తేల్చిన సంస్థలు
- ప్రయాణికుల నుంచి ఆదరణ కరువు.. వంద కూడా జారీకాని వైనం
- ఇప్పటికే గ్రేటర్లో జనరల్ పాస్ నెలకు రూ.1400లే..
- మెట్రోలో కొన్ని షరతులతో నెలకు రూ.2వేలు .. ఈ లెక్కన రెండు పాస్‌లకు రూ.3,400లే
- రూ.8500లో ఆర్టీసీది 17.65..మెట్రోది 82.35 శాతం
- గ్రేటర్లో ఆర్టీసీ బస్సు పాస్‌లు 1.70 లక్షలు
“అతడు పేరు ప్రణవ్. ఐటీ ఉద్యోగి. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి నుంచి హైటెక్ సిటీకి రోజు మెట్రో ప్రయాణం చేస్తాడు. అక్కడ్నుంచి 5 కిలో మీటర్ల దూరంలో తన కార్యాలయానికి ఆర్టీసీ బస్సు వినియోగిస్తున్నాడు. సాయంత్రం అదే మాదిరి ప్రయాణంతో ఇంటికి చేరుకుంటాడు. అంటే ఈ లెక్కన అతడి మెట్రో ప్రయాణానికి నెలకు గరిష్ఠంగా రూ.2వేలు, గ్రేటర్ జనరల్ పాస్‌కు రూ.14వందలు. అంటే రూ.3400తో నెల ప్రయాణం ముగుస్తుంది. అంటే ఉద్యోగులు, విద్యార్థులు రోజులో అటు కార్యాలయం, విద్యాసంస్థలకు తిరిగి ఇంటికి ఒకే ట్రిప్పుతో జర్నీ చేస్తారు. పాస్‌లు తీసుకునే వారు కూడా ఉద్యోగులే అధికంగా ఉంటున్నారు. జాయింట్ పాస్ అంటూ రూ.8500 ధరతో ప్రభుత్వం ప్రయాణికులపై భారం మోపింది. కానీ ఆ పాస్ తీసుకోవడానికి ప్రయాణికులు ఆసక్తి చూపించడం లేదు.”
సిటీబ్యూరో, అక్టోబర్ 29 ( నమస్తే తెలంగాణ ) : ‘జాయింట్ పాస్’ ఆర్టీసీ, మెట్రో మధ్య చిచ్చురేపుతోంది. ఎటువంటి అధ్యయనం లేకుండా జాయింట్ పాస్ ప్రవేశపెట్టి ప్రభుత్వం విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పుడు ఆ ధరను తగ్గించడానికి ఇరు సంస్థలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మెట్రోరైలు, బస్సులో ప్రయాణం చేయడానికి జాయింట్ పాస్ ధర రూ.8,500ను ఇటీవల ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ జాయింట్ పాస్‌కు అటు మెట్రో ఇటు ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఎటువంటి ఆదరణ రావడం లేదు. ఇప్పటి వరకు వంద లోపే పాస్‌లే జారీ అవడం గమనార్హం. దీంతో జాయింట్ పాస్ ధరలు తగ్గించాలని స్వయంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మెట్రో, ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఇందులో ఆర్టీసీ వాటా కేవలం రూ.1500లు ఉంది. మిగిలిన రూ.7వేలు మెట్రో చార్జీనే. దీంతో మెట్రోనే చార్జీలు తగ్గించాలని ఆర్టీసీ చేతులెత్తేసింది. మరోవైపు మెట్రో ప్రయాణం ఎన్నిసాైర్లెనే జర్ని చేసే వీలు ఉంటుందని మెట్రో అధికారులు తగ్గడం లేదు. దీంతో నెల పాస్ యుద్ధం ఆర్టీసీ, మెట్రో మధ్య తేలకపోవడంతో వారం రోజుల ప్రయాణం చేయడానికి వీలుగా మరో ఉమ్మడి పాస్‌ను తీసుకొచ్చారు. ఆ పాస్ ధరను రూ.450 చేశారు. ఇందులోనూ ఆర్టీసీది 150గా ఉంది. అయితే పాస్ ధరల్లో మెట్రోది అధిక వాటా ఉండటం, తాము ఇంకా తగ్గించే వీలుండదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మెట్రోతో ముడిపడిన ప్రతీ జాయింట్ పాస్‌కు పుష్పక్ మినహా అన్ని రకాల బస్సుల్లో ప్రయాణం చేసే వీలుంది. అయితే సాధారణంగా ఆర్టీసీ రోజు వారీ బస్సు పాస్ ధర కూడా రూ. 150 గానే ఉంది. రోజంతా ప్రయాణం చేయోచ్చు. దీంతో జాయింట్ పాస్‌లకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు.
పాస్‌లు.. ధరలు..!
జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్టీసీ బస్సు పాస్‌లు జారీ చేస్తుంది. నగరం నలువైపులా అంటే ఘట్కేసర్ వైపున ఔషాపూర్ వరకు, ఎల్బీనగర్ వైపున కొతగూడ వరకు, మరో రూట్ ఇబ్రహీంపట్నం, ఇంకో రూట్ పటాన్ చెరు వరకు సరిహద్దులు ఉంటాయి. ఆర్టీసీ పరిధిలో నెలవారీ జీహెచ్ఎంసీ సిటీ ఆర్డినరీ (రూ.1400), మెట్రో ఎక్స్‌ప్రెస్ (రూ.1600), గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ రూ.2400, పుష్పక్ రూ.5260, డెయిలీ పాస్ టీ24 రూ.150గా ఉన్నాయి. మరోవైపు మెట్రో ట్రిప్స్ షరతులతో నెలవారీ పాస్ రూ.2వేలుగా ఉంది. ఈ బస్సు పాస్లన్నింటిలో అధిక మంది నగరవాసులు జనరల్ బస్సు పాస్‌నే తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జాయింట్ బస్సు పాస్‌కు రూ.8,500 ధర పెట్టడానికి నగరవాసులు తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య 5 లక్షల నుంచి 17 లక్షలకు చేరింది. బస్సులు కిటకిటలాడుతున్నాయి. కూర్చోవడానికే సీటు లేని పరిస్థితి ఉంది. దీంతో అంత డబ్బు చెల్లించి పాస్ తీసుకోవడం కష్టంగానే ఉంటుందని ఐటీ ఉద్యోగి రవి తెలిపాడు.
గ్రేటర్ ఆర్టీసీ బస్సులు ఇలా..!
మొత్తం బస్సులు -3200
మొత్తం రూట్లు – 700
ఒక్క రోజుకు – 8.50లక్షల కిలో మీటర్ల రాకపోకలు
ట్రిప్పులు – 44వేలు
ప్రయాణికులు -25 లక్షల మంది
మహిళలు-17లక్షల మంది
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

