న్యూఢిల్లీ: కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని గూగుల్ కంపెనీ నిర్ణయించింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు కొవిడ్ టీకా వేసుకోకపోతే తొలుత వేతనం, ఆ తర్వాత ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని తాఖీదు జారీచేసింది. కంపెనీ టీకా విధానాలకు అనుగుణంగా వ్యవహరించని ఉద్యోగులను జనవరి 18 తర్వాత 30 రోజులపాటు వేతన లీవుపై పంపిస్తామని, మరో 6 నెలలు వేతన రహిత లీవును అమలు చేస్తామని తెలిపింది. ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తామని పేర్కొన్నది.