శంషాబాద్, నవంబర్ 24: షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన ఓ ప్రయాణికుడు చేతివాచ్లలో బంగారం దాచి తరలిస్తుండగా బుధవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ 233.4 గ్రాముల బంగారం విలువ రూ.11.56 లక్షలని అధికారులు తెలిపారు. బంగారం స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.