న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడి వైపు మళ్లించడంతో ధరలు భగ్గుమన్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర మరో రూ.550 అందుకొని రూ.50,510కి చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లతోపాటు రూపాయి క్షీణించడంతో ధరలు పెరగడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.1,010 ఎగబాకి రూ.64, 410కి చేరుకున్నది. హైదరాబాద్ బులియన్ మార్కె ట్లో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం రూ.410 అధికమై రూ.50,460, 22 క్యారెట్ల ధర రూ.46,250కి చేరుకున్నది. వెండి రూ.70 వేలుగా ఉన్నది.