హైదరాబాద్, ఏప్రిల్ 5: బంగారం ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు భారీగా తగ్గడంతో దేశీయంగా వరుసగా మూడోరోజు దిగొచ్చింది. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.91 వేల దిగువకు రూ.90,660కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.91,640గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ ధర రూ.900 దిగొచ్చి రూ.83,100 కి పరిమితమైంది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి రూ.5,000 తగ్గి రూ.1.03 లక్షలకు చేరుకున్నది.