Gold Price : బంగారం ధరల (Gold price) పతనం కొనసాగుతున్నది. సోమవారం కొంతమేరకు తగ్గిన పసిడి ధరలు మంగళవారం కూడా అదేబాటలో పయనించాయి. ఇవాళ ఒక్కరోజే తులం బంగారంపై సుమారు రూ.2,500 వరకు తగ్గింది. దాంతో కొనుగోలుదారులు మార్కెట్ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. పశ్చిమాసియా (West Asia) లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు (Crude Oil) ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ (Inflation) భయాలు.. అమెరికా ట్రెజరీ బాండ్ల (US Treasury Bonds) రాబడులు ఆకర్షణీయంగా మారడం వంటి అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై మదుపర్లలో ఆసక్తి తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇవాళ ఉదయానికి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,160 గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,37,640 వద్ద కొనసాగుతున్నది. మరోవైపు వెండి ధర కూడా సోమవారం కిలోపై రూ.5,000 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.44 లక్షలుగా నమోదైంది.