విజయ్‌వీర్‌కు స్వర్ణం, ఉదయ్‌వీర్‌కు రజతం
జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కవల సోదరులు విజయ్‌వీర్ సింధు, ఉదయ్‌వీర్ సింధు దుమ్మురేపారు. బాలుర 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈ ఇద్దరు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఆదివారం కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్లో జరిగిన పోటీలో విజయ్‌వీర్ 587 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకోగా.. ఉదయ్‌వీర్ 586 పాయింట్లతో రజతం కైవసం చేసుకున్నాడు. చిన్న తనం నుంచే షూటింగ్‌పై మక్కువ పెంచుకున్న ఈ పంజాబ్ సోదరులు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరారు. గతంలోనూ పలు టోర్నీల్లో ‘పోడియం’ పంచుకున్న ఈ బ్రదర్స్.. తాజాగా జాతీయ స్థాయిలో తొలి రెండు స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఇదే విభాగంలో హర్యానాకు చెందిన శివ నర్వాల్ (582) కాంస్య పతకం గెలుచుకున్నాడు.