గజ్వేల్, మార్చి17: ఎండిపోతున్న పంటలను కాపాడడానికి ఈనెల 19న కూడవెల్లి, హల్దీవాగుల్లోకి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు గోదావరి జలాలను విడుదల చేయనున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపా రు. గురువారం గజ్వేల్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్సీ డాక్టర్ యాదవరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఎండలు మండుతుండడంతో ఎండిపోతున్న పంటలకు సాగు నీరందించాలని నాయకులు, రైతులు మంత్రి హరీశ్‌రావును కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నుంచి గోదావరి జలాలు విడుదల చేయాలని ఆదేశించారన్నారు. శనివారం ఉదయం 10గంటలకు మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి గో దావరి జలాలు విడుదల చేస్తారని, కూడవెల్లి నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని చెక్‌డ్యాంలు నిండి 106 కిలోమీటర్లు ప్రయాణించి అప్పర్ మానేరుకు గోదావరి జలాలు చేరుకుంటాయన్నారు. కొం డపోచమ్మ సాగర్ సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీవాగులోకి గోదావరి జలాలు విడుదల చేస్తే 112 కిలోమీటర్లు గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల్లోని చెక్‌డ్యాంలు నిండి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుకుంటాయన్నారు. మండుటెండల్లో సైతం రైతులకు ఇబ్బంది కలుగకుండా పుష్కలంగా గోదావరి సాగు నీటి జలాలను అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ ప్రతిభకు ఎవరూ సాటిరారన్నారు. గజ్వేల్ నియోజకవర్గం కాళేశ్వరం జలాలతో పచ్చని పంటలతో సస్యశ్యామలంగా మారిందన్నారు. ఎటుచూసినా గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాలకు సాధ్యం కానిది మాటల్లో చెప్పి చేతల్లో చూపించిన సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని, దీంతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు బెండ మధు పాల్గొన్నారు.