అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్‌లోని అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కార్పోరేషన్ కౌన్సిల్ హాల్లో జరిగిన సాధారణ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. నల్లగొండ కార్పోరేషన్‌ను పార్టీలకతీతంగా అభివృద్ధి చేసేందుకు...
నీలగిరి, అక్టోబర్ 31 : నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్‌లోని అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కార్పోరేషన్ కౌన్సిల్ హాల్లో జరిగిన సాధారణ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. నల్లగొండ కార్పోరేషన్‌ను పార్టీలకతీతంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. క్లాక్ టవర్ సెంటర్లోని పాత ఆర్ అండ్ బి కార్యాలయం స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్, అదేవిధంగా క్లాక్ టవర్ సెంటర్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచ బ్యాంకు రూ.138.21 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.59.23 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం తెలిపిందన్నారు. నల్లగొండను స్మార్ట్ సిటీగా రూపుదిద్దడంలో తమ వంతు సహకారం అందించాలని అమె కార్పోరేటర్లను కోరారు.

అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు డివిజన్లోని పలు కాలనీలో నెలకొన్న సమస్యలను మేయర్ దృష్టికి తీసుకురాగా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. సభ్యులు ఎజెండాను ఆమోదించారు. అనంతరం తన చాంబర్ లో రూ.197.44 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల లోగోను డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కార్పొరేటర్లతో కలిసి మేయర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బి.వంశీకృష్ణ, కార్పోరేటర్లు మందడి లిఖితాసైదిరెడ్డి, మారగోని భవానీగణేష్, దొడ్డి రమేశ్, పిల్లి కృష్ణంరాజు, ఇబ్రహీం, దాసరి సాయికుమార్, అల్లి సుభాష్, పేర్ల మల్లేశ్వరిఅశోక్ చంద్ర, పెరిక యాదయ్య, ముందురు దీపికా ప్రవీణ్ కుమార్‌రెడ్డి, గోపగాని స్వాతీరాజశేఖర్, బణావత్ దీప్తానాయక్, రత్నాపురం తారకమ్మశ్రీనివాస్, ఇటుకాల మంగమ్మశ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

