Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Raptadu Incident | అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన పై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.
అమరావతి : అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన ( Raptadu incident ) పై ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu ) సీరియస్ ( Government Serious ) అయ్యారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని అన్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా బాధితురాలు తల్లితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని ,ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. విద్యార్థినికి అందుతున్న వైద్యంపై ఎమ్మెల్యే పరిటాల సునీతతో మాట్లాడారు వివరాలు తెలుసుకున్నారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుడి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదని అన్నారు. ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఉన్నాదులను ఉక్కుపాదంతో అణిచేస్తామని స్పష్టం చేశారు. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తామని, పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని అన్నారు. విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వహించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరిపై ప్రభుత్వం వేటు వేసింది .
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం పాఠశాల తరగతులు ప్రారంభమైన కొద్ది సేపటికే పదో తరగతి గదిలోకి వెళ్లిన ధర్మవరం మండలం నాగలూరికి చెందిన హేమంత్ అనే నిందితుడు వెంట తెచ్చుకున్న రంపంతో విద్యార్థినిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మొఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. చేయి తెగిపోగా , మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

