Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Patlolla karthik Reddy |హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ మార్చి.. ఎక్కడన్నా ఒక్క 100 ఫీట్ల రోడ్డు ఉంటది.. కానీ రెండు 100 ఫీట్ల రోడ్లను పక్కపక్కనే వేయడం చూశారా..? అని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రజలను అడిగారు.
Patlolla karthik Reddy | 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై ఆందోళన చెందుతున్న నార్సింగి ప్రజలను మాజీ మంత్రి, బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కలిసి వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను వివరించారు.
అనంతరం పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి స్వార్థం కోసం, లాభం కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, డబ్బుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తున్న బహుళ అంతస్తుల బిల్డింగ్‌లను కూడా కొట్టేయాలి, కూలగొట్టాలి అనే దురుద్దేశం సాక్షాత్తు అధికారంలో ముఖ్యమంత్రి, వాళ్ల తమ్ముడికే వచ్చిందంటే దీనికి వంత పాడుతున్న ముఖ్యమంత్రి, వారి కార్యాలయం ఉన్నదంటే ఈ రాష్ట్రం ఎంత అధ్వాన్నంగా, దారుణంగా నడుపబడుతున్నది మీరంతా గమనించాలని కోరుతున్నానని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. మీరే కాదు.. మమ్మల్ని టీవీల్లో చూస్తున్నవాళ్లు కూడా గమనించాలన్నారు.
ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా..?
మాస్టర్ ప్లాన్‌లో 2013లో ఇప్పటికే ఒక 100 ఫీట్ల రోడ్డు ఉన్నది.. అది జనావాలకు సంబంధం లేకుండా అవతలి నుంచి అటు హైవేకు కలిసిపోతుంది. కానీ అది కాదని చెప్పి 4 నెలల కిందట… 2026లో మళ్లీ ఒక గెజిట్ తీసుకొచ్చి హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ మార్చి.. ఎక్కడన్నా ఒక్క 100 ఫీట్ల రోడ్డు ఉంటది.. కానీ రెండు 100 ఫీట్ల రోడ్లను పక్కపక్కనే వేయడం చూశారా..? ఈ కనీవినీ ఎరుగని విచిత్రం ఎక్కడైనా చూశారా..? లేని దగ్గర.. రోడ్డు విస్తరణ ఉన్న దగ్గర ఉండనే ఉండది.. ఈ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో చాలా రోడ్లు సింగిల్‌గానే ఉండిపోయాయి. అక్కడ మాత్రం ఎక్కడ వైండింగ్ ఉండదు.. 100 ఫీట్ల రోడ్డు ఉండదన్నారు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి.
ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి ఆఫీస్ ఇక్కడే ఉంటది.. కొండల్ రెడ్డి ఆఫీస్‌లో ఇక్కడే ఎవరైతే భూమి కొన్నాడని చెప్తున్నామో.. ఆ రాధా రియాలిటీకి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి చైర్ వేసుకుని కూర్చుంటున్నడు. కానీ డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. ముఖ్యమంత్రికి సంబంధం లేదంటే విందామా..? నమ్ముదామా..? బరాబర్ ముఖ్యమంత్రికి సంబంధం ఉన్నదని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. వీళ్ల తరపున ఎవరు కొట్లాడుతారు లే అనుకోవచ్చు కానీ.. బరాబర్ మేమున్నం, హరీశ్‌రావు, కేసీఆర్ ఉన్నరు. మేమున్నమనే కాదు.. ఈ అన్యాయాన్ని పైన దేవుడు గమనించుకుంటున్నడు.. రాబోయే రోజుల్లో ఎన్నికలు పక్కన పెట్టండి.. ఇట్లాంటి నేరాలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకుని పోతదని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో మట్టికొట్టుకొని పోతది
రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం, తన ఆస్తుల కోసం ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజల ఇండ్లను కూల్చివేయాలని కుట్ర చేస్తున్నాడు
మాస్టర్ ప్లాన్‌లో 2013లో జనావాసాలకు ఇబ్బంది కలగకుండా ఒక 100 రోడ్డు ప్లాన్ చేశారు
రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఆఫీసులో ఒక ఛాంబర్లో రాధా రియాలిటీకి సంబంధించిన రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి కూర్చుంటాడు
ఆ రవీంద్రనాథ్ రెడ్డి కొన్న భూముల కోసం రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారు
ఈ రోడ్డు అలైన్మెంట్ మారడంలో రేవంత్ రెడ్డి హస్తం ఉంది
బాధితులకు ఎవరు అండగా ఉండరని అనుకుంటున్నారేమో, మేము అండగా ఉండి వారి తరపున పోరాడుతాం
– పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

