తాండూర్, మార్చి 31 : సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మాదారం టౌన్ షిప్ లోని కోదండ రామాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమంలో మంగళవారం జీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామ కళ్యాణ మహోత్సవం వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతిరోజు పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.
మానసిక ప్రశాంతత కోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళలో దేవాలయాలను సందర్శించడం ఎంతో మంచిది అన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి రావడం మర్చిపోలేని జ్ఞాపకం అన్నారు. ఆలయ పూజారి ముద్దు అవధూత శర్మ జీఎం దంపతులతో పాటు బెల్లంపల్లి ప్రాజెక్టు అధికారి ఉమాకాంత్ దంపతులకు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. ఈ పూజా కార్యక్రమాలకు తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు హాజరు అయ్యారు.