గూడూరు, అక్టోబర్ 5 : జనగామ జిల్లా పాలకుర్తిలోని గురుకులంలో 14 మంది విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన మరువక ముందే మహబూబాబాద్ జిల్లా గూడూరులోని బీసీ గురుకులంలో ఆదివారం రాత్రి ఓ బాలిక కాలును ఎలుకలు కొరికిన ఘటన చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. గూడూరులోని బీసీ గురుకులంలో 5వ తరగతి చదువుతున్న బీమగాని సాయిహర్ష ఆదివారం భోజనం చేసి, కాళ్లకు సాక్స్‌లు వేసుకొని నిద్రించింది. సాయిహర్ష కుడికాలు మడమభాగంలో ఎలుక లు గాయం చేశాయి. పాఠశాల సిబ్బంది బాలికను సీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు.