కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి గిరీంద్ర నాథ్ బర్మాన్పై గురువారం రాత్రి దాడి జరిగింది. నాలుగో విడుత ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న గిరీంద్ర నాథ్ కారుపై బీజేపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో గిరీంద్ర నాథ్ తలకు గాయాలయ్యాయి. బీజేపీ గుండాలే తమపై దాడి చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తృణమూల్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడుతల పోలింగ్ పూర్తయింది. శనివారం నాలుగో విడుతలో 44 స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. దక్షిణ బెంగాల్లోని హౌరా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, ఉత్తర బెంగాల్లోని అలీపుర్దువార్, కూచ్బెహార్ జిల్లాల పరిధిలోని సుమారు 1.15కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. అధికారులు 15,940 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ సాగనుంది.
West Bengal: Girindra Nath Barman,TMC candidate from Mathabhanga, was allegedly attacked by BJP workers while he was returning from election campaign, yesterday.
— ANI (@ANI) April 9, 2021
"BJP goons vandalised his car & attacked him. He has sustained head injuries. We demand action," said a TMC worker. pic.twitter.com/6HstBL3FsT