Ilambarithi | సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నారు. ఎన్నికల పరిశీలకులుగా ఝార్ఖండ్ ఎన్నికల విధులు ముగించుకొని నగరానికి చేరుకున్న కమిషనర్.. సోమవారం జీహెచ్ఎంసీ విధుల్లో చేరనున్నారు.
గడిచిన 25 రోజులుగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ ఆయా శాఖల విభాగాల అధికారులతో దిశానిర్దేశం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్, స్టాండింగ్ కమిటీ సమావేశాలు, సర్వసభ్య సమావేశాలపై పెండింగ్ పడడంతో వీటిపై కమిషనర్ దృష్టి సారించనున్నారు.