Under -19 Asia Cup : అండర్-19 ఆసియా కప్‌ను భారత జట్టు రెండో విక్టరీ కొట్టింది. తొలి పోరులో ఆతిథ్య యూఏఈని చిత్తుగా ఓడించిన టీమిండియా ఈసారి పాకిస్థాన్‌ను 90 పరుగులతో మట్టికరిపించింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో అరోన్ జార్జ్(85) అర్ధ శతకంతో చెలరేగగా.. బౌలర్లు దీపేశ్ దేవేంద్రన్(3-16), కనిష్క్ చౌహన్(3-33) మూడేసి వికెట్లతో దాయాది బ్యాటర్లను బెంబేలెత్తాంచారు. దాంతో.. ప్రత్యర్ధిని 41.1 ఓవర్లలో 150కే ఆలౌట్ చేసింది భారత్. వరుసగా రెండో విజయంతో గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ఆయుష్ మాత్రే సేన.
అండర్ -19 ఆసియా కప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. తొలిపోరులో యూఏఈపై భారీ విజయంతో బోణీ కొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఇటీవల రైజింగ్ స్టార్స్ ఆసియాకప్(Rising Star Asia Cup)లో ఎదరైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ 90 పరుగులతో దాయాదిని మట్టికరిపిచింది యువ భారత బృందం.
India strike at the right moment! 💥🇮🇳
Deepesh Devendran gets the breakthrough as the Indian bowlers tighten the screws! 🔥
Watch India 🆚 Pakistan in the U19 #AsiaCup, LIVE on #SonyLIV & #SonySportsNetwork TV channels 📺 pic.twitter.com/U2oL1ED1Wd
— Sony LIV (@SonyLIV) December 14, 2025
తొలుత ఆడిన భారత జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(5) శుభారంభమివ్వలేదు. కెప్టెన్ ఆయుస్ మాత్రే సైతం(38)కే సయ్యాం ఓవర్లో వెనుదిరిగాడు. 78కే రెండు బిగ్ వికెట్లు పడిన వేళ క్రీజలో పాతుకుపోయిన అరోన్ జార్జ్(85) జట్టుకు భారీ స్కోర్ అందించాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న జార్జ్ సూపర్ అర్ధ శతకం బాదేయగా.. ఆఖర్లో కనిష్క్ చౌహన్(46) ధనాధన్ ఆడడంతో టీమిండియా 240 పరుగులకే ఆలౌటయ్యింది.
Innings Break!
Aaron George’s crucial 85(88) helps India U19 set a target of 2⃣4⃣1⃣🎯
Over to our bowlers 👍
Scorecard ▶️ https://t.co/9FOzWb0aN7#MensU19AsiaCup2025 pic.twitter.com/DLtJk3EfRa
— BCCI (@BCCI) December 14, 2025
ఛేదనలో పాకిస్థాన్‌కు భారత బౌలర్లు దీపేశ్ దేవేంద్రన్(3-16), కనిష్క్ చౌహన్(3-33)లు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలోనే ఓపెనర్ సమీర్ మిన్హాస్(9)ను ఔట్ చేసిన దీపేశ్ వికెట్ల వేటకు తెర తీశాడు. ఆకసేపటికే కనిష్క్ ఓవర్లో ఉస్మాన్ ఖాన్(16) ఔటయ్యాడు. వీరిద్దరి విజృంభణతో 77కే ఐదు వికెట్లు కోల్పోయిన పాక్‌ను కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్(23), హుజైఫా అహ్సన్(70)లు ఆదుకునే ప్రయత్నం చేశారు.
కానీ, యూసఫ్‌ను వైభవ్ పెవిలియన్ పంపగా.. అర్ధ శతకంతో మెరిసిన అహ్సన్.. వైభవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. అంతే.. పాక్ ఓటమి ఖాయమైంది. చివరి బ్యాటర్ అలీ రజా(6)ను కుమార్ సింగ్ బోల్తా కొట్టించగా 90 పరుగులతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. గ్రూప్ దశ మూడో మ్యాచ్‌లో మాత్రే బృందం డిసెంబర్ 16న మలేషియాతో తలపడనుంది.