కరెంట్ మీటర్ – Current Meter
1 మాల్దీవుల అధ్యక్ష స్థానానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు ఎవరు?
2 భారతీయ సినీ రంగంలో అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2023 సంవత్సరానికి ఏ నటీమణికి ప్రకటించారు? ఆమె తొలి చిత్రం పేరు చెప్పండి?
3 చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ ఫైనల్లో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సాధించిన తెలంగాణ గురుకుల కళాశాల విద్యార్థిని ఎవరు?
4 భూమ్మీద 8,000 మీటర్లకుపైగా అత్యంత ఎత్తయిన పర్వతాలను అతి ఎక్కువసార్లు అధిరోహించిన పర్వతారోహకుడిగా రికార్డు సాధించి వార్తల్లో నిలిచిన నేపాల్ వ్యక్తి ఎవరు?
5 మన జనాభాకు సరిపడా ఆహారం పండించడానికి భారత ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమం.. హరిత విప్లవం. కోట్లాది ప్రజల ఆకలి తీర్చిన ఈ మహత్తర కార్యానికి వెన్నెముకగా నిలిచిన వ్యవసాయ శాస్త్రవేత్త ఇటీవల మరణించారు. ఆయన పేరు?
6 ప్రపంచ మానవాళిని గడగడలాడించిన కొవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా ఎంఆర్ఎన్ఏ టీకాను అభివృద్ధి చేసిన ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలకు ఈ ఏడాది వైద్యశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ప్రకటించారు. వాళ్లు ఎవరు?
7 కెనడా ఇండియా ఫౌండేషన్.. తమతమ రంగాల్లో విశేష కృషిచేసిన భారతీయులకు ఇచ్చే గ్లోబల్ ఇండియన్ పురస్కారానికిఎంపికైన తొలి మహిళగా వార్తల్లో ఎవరు నిలిచారు?
8 ఆసియా క్రీడల్లో తొలిసారిగా క్రికెట్‌ను టీ20 ఫార్మాట్లో ప్రవేశపెట్టారు. ఈ పోటీల్లో మహిళల విభాగంలో తొలి స్వర్ణాన్ని దక్కించుకున్న జట్టు ఏది?
9 ఇటీవల మరణించిన.. ప్రసిద్ధ దేశీయ పెయింట్స్ కంపెనీ ఆసియన్ పెయింట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆ కంపెనీ సహ-వ్యవస్థాపకుడు ఎవరు?
10 యునైటెడ్ కింగ్డమ్ (ఇంగ్లండ్)లో రెండు కొండల మధ్య ఓ పెద్ద వృక్షం ఠీవిగా నిల్చున్న దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాల్‌పేపర్‌గా ప్రసిద్ధి చెందింది. ఓ బాలుడి దుశ్చేష్టకు నేలకూలిన ఆ చెట్టు పేరేంటి? అది ఉన్న ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు?
1. మహ్మద్ ముయిజ్జు
2. వహీదా రెహ్మాన్, తెలుగు చిత్రం రోజులు మారాయిలో ఏరువాక సాగారో… పాటలో
3. అగసర నందిని
4. కామీ రీటా షెర్పా (53 ఏండ్లు, 42 సార్లు అధిరోహించాడు)
5. మానకొంబు సాంబశివన్ స్వామినాథన్
6. కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్
7. సుధామూర్తి (ఆమె భర్త నారాయణమూర్తి 2015లో ఇదే పురస్కారం అందుకున్నారు)
8. భారత మహిళల జట్టు (శ్రీలంకను ఓడించి ఈ ఘనత సాధించింది)
9. అశ్విని సూర్యకాంత్ డాని (79 ఏండ్లు)
10. సైకమోర్ చెట్టు. బ్రిటన్‌లోని నార్త్ అంబర్లాడ్లో హాండ్రియన్ వాల్ దగ్గరున్న సైకమోర్ గ్యాప్‌లో ఉంది.