వరంగల్ : నగరంలో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి అమ్మవారిని హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. సోమవారం అలయాన్ని సందర్శించిన ఆయనను స్థానిక టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు శ్రీనివాస్ యాదవ్‌కు మహాశీర్వాచనం , అమ్మవారి ప్రసాదం అందచేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, బంగారు తెలంగాణ దిశగా చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలం కావాలని అమ్మవారిని కోరినట్లు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో తన విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.