e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News కోవిడ్ పాజిటివ్ వచ్చాక షూటింగ్‌కు వెళ్లిన హీరోయిన్.. కేసు నమోదు

కోవిడ్ పాజిటివ్ వచ్చాక షూటింగ్‌కు వెళ్లిన హీరోయిన్.. కేసు నమోదు

కోవిడ్ పాజిటివ్ వచ్చాక షూటింగ్‌కు వెళ్లిన హీరోయిన్.. కేసు నమోదు

కరోనా వైరస్ ఇండియా నుంచి కాదు ప్రపంచం నుంచి ఇంకా పోలేదు. ఈ మధ్య మళ్లీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఇండియాలో 25 వేల పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ వైరస్ ఎంత ప్రమాదమో తెలిసిన తర్వాత కూడా కొందరు ఇంకా దాంతో ఆడుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఓ హీరోయిన్ కూడా ఇదే చేసింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి కూడా సినిమా షూటింగ్ కు వచ్చి తనతో పాటు అందర్నీ ప్రమాదంలో పడేసింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. కోవిడ్ నిబంధనల ప్రకారం వైరస్ సోకితే రెండు వారాలు బయటికి రాకూడదు. 

క్వారంటైన్ పూర్తైన తర్వాత కానీ బయట ప్రపంచంలోకి అడుగు పెట్టకూడదు. అది కూడా పూర్తిగా నెగిటివ్ వచ్చిన తర్వాతే బయటికి రావాలి. కానీ కరోనా నిబంధనలు తుంగలో తొక్కుతూ పాజిటివ్ తోనే షూటింగ్ కు వచ్చింది బిగ్ బాస్ 7 విన్నర్, బాలీవుడ్ నటి గౌహార్ ఖాన్. అందుకే కరోనా నిబంధనల ఉల్లంఘన పేరుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు ముంబై పోలీసులు. సినిమాలు, టీవీ షోలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది గౌహార్ ఖాన్. ఈ మధ్యే ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో క్వారంటైన్ లో ఉండాలంటూ వైద్యులు కూడా సూచించారు. కానీ గౌహార్ షూటింగ్‌కు వచ్చిందని BMC అధికారి తెలిపారు. దాంతో ఈమెపై బీఎంసీ అధికారులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసారు. 

ఈ ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు. అంతేకాదు దీనిపై పౌరసంఘం కూడా ట్వీట్ చేసింది. ముంబై నగర భద్రతపై రాజీ లేదు.. కోవిడ్ 19 మార్గదర్శకాలను పాటించనందుకు బాలీవుడ్ నటి గౌహార్ ఖాన్‌పై BMC ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ నియమాలు అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి.. అన్ని మార్గదర్శకాలను అనుసరించాలని.. వైరస్‌ను ఓడించటానికి నగరానికి సహాయం చేయాలని మేము పౌరులను కోరుతున్నాము అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కనీసం ఫోన్స్ కు కూడా రెస్పాండ్ కావడం లేదు గౌహార్ ఖాన్. వీలైనంత త్వరగా ఈమె జాడ కనుగొంటామని చెప్తున్నారు ముంబై పోలీసులు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కోవిడ్ పాజిటివ్ వచ్చాక షూటింగ్‌కు వెళ్లిన హీరోయిన్.. కేసు నమోదు

ట్రెండింగ్‌

Advertisement