కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సాకారం
తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29 ఒక కీలకమైన మలుపు తీసుకువచ్చిన రోజు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
- 29న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి: మాజీ మంత్రి గంగుల
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 20 : తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29 ఒక కీలకమైన మలుపు తీసుకువచ్చిన రోజు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల 29న కరీంనగర్లోని అలుగునూర్లో దీక్షా దివస్ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లోని మిషన్ హాస్పిటల్ సమీపంలో వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో ఆమరణ నిరహార దీక్షకు దిగడంతోనే ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని అన్నారు.
ఈ దీక్ష వల్లే రాష్ట్ర ప్రకటన వచ్చిందని గుర్తుచేశారు. ఈ దీక్షకు వెళ్తున్న కేసీఆర్ను అరెస్టు చేసిన అలుగునూర్ ప్రాంతంలోనే దీక్షా దివస్ బహిరంగ సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, నేతలు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

