గాంధారి వన్నెచిన్నెలు
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. దక్షిణాదిన అరడజను ప్రాజెక్ట్‌లు ఆమె చేతిలో ఉన్నాయి. తీరికలేని బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నప్పటికీ ఈ భామ తన అభిరుచి మేరకు ఓ వీడియో ఆల్బమ్‌లో నర్తించింది. ‘గాంధారి’ పేరుతో రూపొందిన ఈ వీడియో ఆల్బమ్‌ను ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆల్బమ్ తాలూకు ఓ పోస్టర్‌ను కూడా అభిమానులతో పంచుకుంది. ఇందులో ఈ అమ్మడు సంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నది. తన హృదయానికి ఎంతో ఇష్టమైన గీతమాలిక ఇదని కీర్తి సురేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. ఈ వీడియో ఆల్బమ్‌ను ప్రముఖ సంస్థలు సోనీ మ్యూజిక్ సౌత్, ది రూట్ నిర్మించాయి. పవన్ సీహెచ్ సంగీతాన్నందించారు. బృందా నృత్యరీతుల్ని సమకూర్చారు. కీర్తి సురేష్ తొలిసారి నర్తించిన ఈ వీడియో ఆల్బమ్ అభిమానుల్ని రంజింపజేస్తుందని, ఆమె అభినయం, నృత్యాలు ప్రత్యేకార్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో సర్కారు వారి పాట, భోళాశంకర్, దసరా చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Kirti Suresh
- pawan ch
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

