Gaddar Daughter | తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్, గద్దర్ కూతురు వెన్నెల తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ కామెంట్స్ నేపథ్యంలో వెన్నెల మాట్లాడుతూ.. పవనన్న మిమ్మల్ని ఒక నటుడిగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలను ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నానన్నారు.
తెలంగాణ సినిమాల్లో నటిస్తే రాలేదు.. తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు. పైసలు పంచితే రాలేదు.. లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవపోరాటం. ఎవరినీ ఒక్క బాధపెట్టుకుండా.. హింసించకుండా తమను తాము ఆహూతి చేసుకున్న శ్రీకాంత్ చారియే సాక్ష్యమన్నారు.
తెలంగాణ పోరాటం ఒక సాంస్క్కృతిక యుద్దం. పాటలతో మాటలతో ప్రజల్లోకి వెళ్లి.. గడపగడపకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేసిన పోరాట గాథలున్న ఈ తెలంగాణ గడ్డ. మా భూములు మావి.. మా నీళ్లు మావి..మా పాలన మాది అనే నినాదంతో పల్లెపల్లె గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ. తెలంగాణ మా అయ్యల జాగీరే, రేపు మా బిడ్డల జాగీరు కూడా అంటూ వెన్నెల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి.
అవును తెలంగాణ మా అయ్యల జాగీరే
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కూతురు
తెలంగాణ మా అయ్యల జాగీరే,
రేపు మా బిడ్డల జాగీరు కూడాత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాము కానీ పైసలు ఇచ్చి లాబీయింగ్ చేసి తెచ్చుకోలేదు
తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేశాము, కానీ ఎవరినీ ఒక్క మాట… https://t.co/VwIUvM4u7I pic.twitter.com/31xVSX8sx8
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026