మోటకొండూర్, నవంబర్ 3: మాదిగలను కించపరిచేలా మాట్లాడిన ప్రజా గాయకుడు గద్దర్ వెంటనే క్షమాపణ చెప్పాలని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడా రు. ‘ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని, మాదిగలను తాను ఎప్పుడూ ప్రోత్సహించలేదు’ అని ఫోన్లో సంభాషించడంపై మండిపడ్డారు.