న్యూఢిల్లీ, మార్చి 28: దేశంలో పెట్రో వడ్డన కొనసాగుతున్నది. సోమవారం లీటర్ పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. గత ఏడు రోజుల్లో ఇంధన ధరలు పెరుగడం ఇది ఆరోసారి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.71కు పెరగ్గా, డీజిల్ రూ.99.07కి చేరింది. ఈ వారం రోజుల్లో మొత్తంగా పెట్రోల్‌పై రూ.4.51, డీజిల్‌పై రూ.4.45 పెరిగింది.
ధరల పెంపు ఉపసంహరించుకోవాలి
ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలని, ఈ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ధరల పెరుగుదలకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే కారణమన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చాయి. జీరోఅవర్‌లో లోక్‌సభలో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ ఎంపీలు మాట్లాడుతూ ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలు, వేతన జీవుల జేబులు గుల్లవుతున్నాయని విమర్శించారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చించాలని, దీనికి ఎప్పుడు పుల్‌స్టాప్ పడుతుందో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో ఆదివారం ధర పెంపు(పైసల్లో) తాజా ధర
పెట్రోల్ :రూ.112.37 :34 :రూ.112.71
డీజిల్ :రూ.98.69 :38 :రూ.99.07