Unni Mukundan | మలయాళ యువ నటుడు ఉన్ని ముకుందన్ తనపై దాడి చేశాడంటూ.. అతడి మేనేజర్ విపిన్ కుమార్ కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిసిందే. ఈ వ్యవహారంపై విపిన్ కుమార్ మాట్లాడుతూ.. నేను 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రమోషన్ కన్సల్టెంట్‌ని. నేను నటీనటులు, ఇతర సినిమాలుకు పీఆర్ కూడా పనిచేస్తాను. నేను దాదాపు 500 చిత్రాలకు పనిచేశాను. ‘నరివెట్ట’ ప్రమోషన్లలో భాగంగా సినిమాను, టోవినో థామస్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఒక నోట్ పోస్ట్ చేసాను. ఉన్ని ముకుందన్‌కు అది నచ్చలేదు.
ఉన్ని ముకుందన్ ఆ రాత్రి నాకు ఫోన్ చేసి నన్ను మేనేజర్ పదవి నుండి తొలగించాడన్నాడు విపిన్ కుమార్. నేను సరే అన్నాను. ఆ తర్వాత అతను వచ్చి నాపై దాడి చేశాడంటూ చెప్పుకొచ్చాడు . ఉన్నిముకుందన్ దుర్భాష కూడా వాడాడు. దీంతో ఫిర్యాదు చేశాను. నేను అతనితో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఉన్ని ముకుందన్ టీజింగ్‌ను ఎదుర్కొన్నప్పటికీ నేను ఆ ఉద్యోగంలోనే ఉన్నా. మార్కో నుండి మంచి ప్రాజెక్టులు లేకపోవడం, అతడు నటించిన Get Set Baby చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవడంతో ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల నిరాశ చెందాడు.
అలాగే ఉన్ని ముకుందన్ డైరెక్టోరియల్ డెబ్యూ మూవీని శ్రీ గోకులం మూవీస్ మొదట నిర్మించడానికి అంగీకరించినప్పటికీ తరువాత వారు తిరస్కరించారు. ఇవన్నీ ఉన్నిముకుందన్లో నిరాశకు దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉన్నిముకుందన్ తరచూ తన చుట్టూ ఉన్నవారిపై నిరాశ, నిస్పృహను బయటపెట్టేవాడు. అందుకే ఒకప్పుడు అతనితో పనిచేసిన చాలా మంది ఇప్పుడు ఉన్నిముకుందన్తో సంబంధం కలిగి లేరు. నేను ఇవన్నీ ఎంతకాలం భరించగలనంటూ చెప్పుకొచ్చాడు విపిన్ కుమార్.
Rains | హైదరాబాద్‌కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు