హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది ప్రారంభంలోనే టెండర్ల ప్రక్రియ వద్ద అడ్డంకులు ఎదుర్కొంటున్నది. టెండర్లకు స్పందన కనిపించలేదు. బకాయిలు విడుదల కాకపోవడంతో ఎవరు ముందుకు రాలేదు. 32 జిల్లాలకు టెండర్లు పిలిస్తే, 17 జిల్లాలకు మాత్రమే టెండర్లు దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ టెండర్ల గడువు సోమవారంతో ముగిసింది. నల్లగొండ జిల్లాలో రెండు టెండర్లు రాగా, మిగిలిన జిల్లాల్లో కాంట్రాక్టర్లు సిండికేట్గా మారడంతో ఒక్కొక్క టెండరు వచ్చినట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెండర్ల గడువును మరో మూడు రోజులు మత్స్యశాఖ పొడిగించింది.