గూగుల్ కు ఫ్రాన్స్ భారీ జరిమానా…

పారిస్,జూలై : గూగుల్ కు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 500 మిలియన్ యూరోలు (రూ.4,415 కోట్లు) విధిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. పలు దేశాలు డిజిటల్ కంటెంట్ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఫ్రాన్స్ గూగుల్ కు ఫైన్ వేసింది. న్యూస్ పబ్లిషింగ్ విషయంలో స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆదేశాలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ ఫైన్ విధించింది.
వార్తా సంస్థలు గూగుల్ మధ్య చాలా కాలంగాకోల్డ్ వార్ జరుగుతున్నది. అయితే తమ వార్తల్ని ‘గూగుల్ న్యూస్’లో ప్రచురించి ప్రకటనల రూపంలో అల్ఫాబెట్ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందని వార్తా సంస్థల యజమానులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటనల ఆదాయంలో తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక డిజిటల్ చట్టాల్ని అమలుచేస్తున్నాయి. వివిధ మీడియా సంస్థలకు చెందిన వార్తల్ని ప్రచురించడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు గూగుల్‌కు కొంత గడువు కూడా ఇచ్చాయి.
ఈ క్రమంలో ఫ్రాన్స్ యాంటీ ట్రస్ట్ ఏజెన్సీ సైతం స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో భారీ జరిమానా విధించాలని నిర్ణయించింది. ఫ్రాన్స్ ప్రభుత్వ చట్టాల్ని, నిబంధనల్ని అమలు చేయడంలో గూగుల్ జాప్యం చేసిందని తద్వారా కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపిస్తున్నది ఫ్రాన్స్.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Copy right
- Fine
- France
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

