న్యూఢిల్లీ: భారత వాయు రక్షణ సామర్థ్యాలకు ఊతమిస్తూ, రష్యాకు చెందిన ఎస్-400 సుదర్శన్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థకు చెందిన నాల్గవ స్కాడ్రన్ భారత్‌కు చేరుకుంది. రష్యాతో 2018 ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్న ఐదు ఎస్-400 స్కాడ్రన్లలో ఇది నాల్గవది.
ప్రతి ఎస్-400 స్కాడ్రన్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ యూని ట్లు, క్షిపణి లాంచర్లలో కలిసి 16 వాహనాలు ఉంటాయి. ఎస్-400 అనేది ప్రపంచంలోనే అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ. ఇది యుద్ధ విమానాలు, నిఘా ప్లాట్‌ఫామ్‌లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను గుర్తించడంతో పాటు వాటిని ట్రాక్ చేయగలదు.