ఢిల్లీ హోటల్లో భారీ అగ్నిప్రమాదం
దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోగల ఓ రెస్టారెంట్లో బుధవారం ఉదయం భారీ స్థాయిలో మంటలు చెలరేగి 21 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
- 21 మంది మృతి, పలువురికి గాయాలు
- మృతులలో విదేశీయులే అత్యధికం
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోగల ఓ రెస్టారెంట్లో బుధవారం ఉదయం భారీ స్థాయిలో మంటలు చెలరేగి 21 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఒకే ప్రవేశ, నిష్క్రమణ మార్గమున్న ఫ్లరిష్ బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదం నుంచి పలువురిని కాపాడినప్పటికీ మరికొందరు మంటల్లో చిక్కుకుని ఉంటారని తెలుస్తున్నది. స్థానికులు రోడ్డుపై పరుపులు పరచడంతో భవనంలోని మూడవ అంతస్తులో చిక్కుకున్న పలువురు వ్యక్తులు పైనుంచి కిందికి దూకారు. ఓ మహిళ తన చంటిబిడ్డను పట్టుకుని 3వ అంతస్తు నుంచి కిందకు దూకగా ఆమెకు కాలు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డీఎఫ్ఎస్తోపాటు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది, పోలీసులు, అంబులెన్సు సర్వీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. హోటల్లో బస చేసిన విదేశీయులు సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా నుంచి చికిత్స కోసం వచ్చినట్లు అధికారులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద ఈ హోటల్ నడుస్తున్నది. మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియరాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

