కట్నీ: నాలుగేండ్లకే ఓ బాలుడు కానిస్టేబుల్ అయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా ఎస్పీ.. బాల రక్షక్ పోస్టులో గజేంద్ర మర్కం అనే బాలుడిని నియమించారు. నర్సింగాపూర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే గజేంద్ర తండ్రి శ్యాం సింగ్ మర్కం ఇటీవల మరణించారు. జిల్లాలో ఆరేడు బాల రక్షక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నిబంధనల ప్రకారమే ఈ నియామకం జరిపినట్టు ఎస్పీ సునీల్ జైన్ పేర్కొన్నారు.18 ఏండ్లు వచ్చే వరకు సగం జీతం చెల్లిస్తారు. సాధారణంగా బడికి వెళ్లి చదువుకోవచ్చని, ఎప్పుడైనా ఓసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి వెళ్తే సరిపోతుందని పోలీసులు చెబుతున్నారు.