హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కొత్తగా నియమితులైన నలుగురు న్యాయమూర్తులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో జిల్లా జడ్జీల కోటా నుంచి నియమితులైన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగరావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎడ తిరుమలాదేవి, హైకోర్టు పరిపాలన విభాగం రిజిస్ట్రార్ బొబ్బిలి రామయ్య మధుసూదన్‌రావు ఉన్నారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ వీరితో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను హైకోర్టు తాత్కాలిక రిజిస్ట్రార్ జనరల్ చదవి వినిపించారు.