హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్‌కుమార్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి రైల్వేట్రాక్‌పై ఆయన విగతజీవిగా కనిపించారు. పరకామణిలో విదేశీ డాలర్లు దొంగిలించిన కేసులో టీటీడీ ఉద్యోగి రవికుమార్‌పై అప్పట్లో సతీశ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసుపై సతీశ్‌కుమార్‌ను ఈనెల 6న సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం విచారించింది. ఈ క్రమం లో మరోసారి విచారణకు రావాలని నోటీసులు పంపారు. దీంతో పోలీసుల వేధింపులు భరించలేక సతీశ్‌కుమార్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. అయితే ఆయన శరీరంపై ఉన్న గాయాల కారణంగా ఎవరైనా హత్యచేసి ఉంటారని అనుమానిస్తున్నారు.