న్యూఢిల్లీ: మాజీ సైనికులు, వారి కుటుంబీల సంక్షేమానికి సంబంధించిన బిల్లును కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆమోదించగా, నవంబర్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈ బిల్లుతో ఇప్పటివరకు పెన్షన్ పొందలేని మాజీ సైనికులు, స్థిరమైన ఆదాయం లేని వితంతువులకు రూ. 4వేల నుంచి రూ.8 వేల వరకు పెరుగుతుంది.
విద్యా గ్రాంటు ద్వారా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.2 వేల చొప్పున విడుదల చేస్తారు. ఇద్దరు కుమార్తెల వివాహం లేదా వితంతువు మళ్లీ వివాహం చేసుకోవడానికి రూ. లక్ష వరకు ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ నిధులు సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి నుంచి సమకూరుతాయని వెల్లడించింది.