కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి?
కరోనా వైరస్‌కు గురైన ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ శనివారం ఉదయం మరణించారు. అయితే ఈ వార్తలను పుకార్లుగా జైలు అధికారులతోపాటు దవాఖాన అధికారులు కొట్టిపారేస్తున్నారు

పట్నా : కరోనా వైరస్‌కు గురైన ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ శనివారం ఉదయం మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలను జైలు అధికారులతోపాటు దవాఖాన అధికారులు కొట్టిపారేస్తున్నారు. షాహాబుద్దీన్ మృతికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బిహార్‌లోని సివాన్‌కు చెందిన మహ్మద్ షాహాబుద్దీన్ హత్య కేసులో నిందితుడిగా తేలి తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు షాహాబుద్దీన్ కు చికిత్స అందించేందుకు రెండు రోజుల క్రితం ఈ దవాఖానలో చేర్చించగా.. శనివారం తెల్లవారు జామున 3.40 గంటలకు తుది శ్వాస విడిచినట్లు తెలుస్తున్నది. అయితే, ఆయన మరణ వార్తను అధికారులు ధ్రువీకరించలేదు.
మాజీ ఎంపీ షాహాబుద్దీన్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు గురై మరణించారని, ఆర్జేడీ కుటుంబానికి ఇది విచారకరమైన వార్త అని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. ఆయన పేద ప్రజల కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
వాస్తవానికి, షాహాబుద్దీన్ కరోనా బారిన పడినట్లు తిహార్ జైలు అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 20 న ఆయన పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడం ప్రారంభమైంది. నివేదిక పాజిటివ్‌గా వచ్చిన వెంటనే షాహబుద్దీన్‌కు తిహార్ జైలు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందివ్వడం ప్రారంభించారు.
బాహుబలి నాయకుడిపై ఎన్నో కేసులు
బిహార్ బాహుబలిగా పిలుచుకునే మహ్మద్ షాహాబుద్దీన్‌పై జీవిత ఖైదు తోపాటో 30 కి పైగా కేసులు నమోదయ్యాయి. అతడిని బిహార్ నుంచి తిహార్ జైలుకు తీసుకురావాలని సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 15 న ఆదేశించింది. తిహార్‌కు ముందు భగల్పూర్, సివాన్ జైలులో కూడా సుదీర్ఘ శిక్ష అనుభవించాడు. అతను 2018 లో బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే బెయిల్ రద్దు కారణంగా అతను తిరిగి జైలుకు వెళ్ళవలసి వచ్చింది.
ఇవి కూడా చదవండి…
నిషేధిత టీఎల్పీ ముందు మోకరిల్లిన ఇమ్రాన్‌ఖాన్
అమెరికాతో పోరు ఎప్పటికీ ముగియదు : అల్ ఖైదా
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

