హానెస్ట్‌గా తీసిన గ్లోబల్ సినిమా ‘కల్ట్’
‘మొదటి అయిదు నిమిషాలకే ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఇదో గ్లోబల్ కంటెంట్.
‘మొదటి అయిదు నిమిషాలకే ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఇదో గ్లోబల్ కంటెంట్. అందుకే ఈ సినిమాను జపనీస్,స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేశాం. ఇది భాషను దాటి వెళ్లే సినిమా. రెండు గంటల 20 నిమిషాల పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. యాక్షన్ కంటే ఆడియన్స్ డ్రామాకు కనెక్టవుతారు. నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రతిసారీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇందులో ఎలాంటి ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఉండవు. చాలా హానెస్ట్‌గా ఈసినిమా చేశాం.
ఇందులో 150మంది ప్రొఫెషనల్ యాక్టర్స్ ఉన్నారు. వారంతా కేవలం నా కోసం ఈ సినిమాలో భాగమయ్యారు. నటుడిగానే కాక, దర్శకునిగా కూడా నాకు సంతృప్తిని ఇచ్చిన సినిమా ‘కల్ట్” అని విశ్వక్సేన్ అన్నారు. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన సినిమా ‘కల్ట్’. సందీప్ కాకరాల నిర్మాత. ఈ నెల 30న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్సేన్ మాట్లాడారు. ఇంకా నిర్మాత సందీప్ కాకరాల, యాక్టర్ ఈజీ, అనిరుధ్, కార్తికేయ, తారక్ పొన్నప్ప కూడా మాట్లాడారు.
గోవాలోని ఒక నిర్మానుష్య ఐలాండ్ ఎస్టేట్‌లో 300మందికి పైగా చిక్కుకుపోవడంతో ట్రైలర్ మొదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ట్రైలర్ సాగింది. ట్రైలర్లో విశ్వక్ పాత్ర విభిన్న కోణాల్లో కనిపించింది. వాస్తవంగా జరిగిన భయానక సంఘటనల స్ఫూర్తితో రూపొందిన తొలి ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ ఇదని మేకర్స్ చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

