SYG షూటింగ్ పూర్తి
మెగా హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘సంబరాల ఏటి గట్టు’(SYG). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.
మెగా హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘సంబరాల ఏటి గట్టు’(SYG). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ‘బిహైండ్ ది సీన్స్’ వీడియోలో ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్స్‌ని, కొన్ని రా యాక్షన్ సన్నివేశాలతోపాటు టీమ్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ని కూడా చూపించారు. పదికి పైగా భారీ షెడ్యూల్స్‌తో 160 రోజులకు పైగా షూటింగ్ జరిపామని, సాయిదుర్గతేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా ‘సంబరాల ఏటిగట్టు’ నిలుస్తుందని మేకర్స్ తెలిపారు.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా యూనిట్ మొత్తానికీ కృతజ్ఞతలు తెలుపుతూ, టీమ్‌తో కలిసి హీరో సాయిదుర్గతేజ్ సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ, ఐశ్వర్యలక్ష్మి, జగపతిబాబు, నరేష్ వీకే, సాయికుమార్, శ్రీకాంత్ మేక, అనన్య నాగళ్ల ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిసామి, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

