లోక్‌భవన్‌లో ఘనంగా దసరా వేడుకలు
విజయదశమి పర్వదినాన్ని పురసరించుకొని తెలంగాణ లోక్‌భవన్‌లో అదివారం దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా దుర్గాదేవితోపాటు పోచమ్మదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ఆయుధ పూజ నిర్వహించిన గవర్నర్
హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : విజయదశమి పర్వదినాన్ని పురసరించుకొని తెలంగాణ లోక్‌భవన్‌లో అదివారం దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా దుర్గాదేవితోపాటు పోచమ్మదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రతాసిబ్బందికి చెందిన ఆయుధాలు, అధికారిక వాహనాలకు ఆయుధ పూజ చేశారు. అనంతరం లోక్‌భవన్ అధికారులు, సిబ్బంది గవర్నర్‌ను కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, నవరాత్రి, విజయదశమి వేడుకలను ప్రతి ఒకరూ సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగలు రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని, సమాజంలో శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

