Ramayana Movie | అమెరికాలో హిస్టారికల్ వరల్డ్ ప్రీమియర్
నితీశ్ తివారీ రూపొందిస్తున్న ఈ వెండితెర ఇతిహాసంలో సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
దేశమంతా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. నితీశ్ తివారీ రూపొందిస్తున్న ఈ వెండితెర ఇతిహాసంలో సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా మూడువేల కోట్ల నిర్మాణ వ్యయంతో రెండు భాగాలుగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ ఫ్రాంచైజీలోని తొలి భాగం దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్నది.
ఈ నేపథ్యంలో మేకర్స్ వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న సాయంత్రం అమెరికా లాస్ ఎంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్లో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ జరుగనున్నది. ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించే ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్ ప్రముఖుల, దర్శకులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిథులు, పలువురు ప్రపంచ సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు, ఆస్కార్ వేడుకలకు వేదికగా నిలిచిన అకాడమీ మ్యూజియంలో ‘రామాయణ’ ప్రీమియర్ జరుగనుండటం భారతీయ సినీచరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టమని మేకర్స్ చెబుతున్నారు. 945మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ థియేటర్లో 3డీ ఫార్మాట్లో ఈ సినిమా స్క్రీనింగ్ జరుగనున్నది. ఇక ఈ ఫ్రాంచైజీకి చెందిన రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రానున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

