కాంగ్రెస్ నిర్వాకంతోనే కరువొచ్చింది
గురువు కోసం నీళ్లు.. స్కాముల కోసం కరెంట్ బలి.. వచ్చిన విద్యుత్తు, తెచ్చిన నీళ్లను మాయం చేస్తుండ్రు.. సర్కార్‌ను నడుపడం చేతగాకుంటే తప్పుకో రేవంత్
- మాకు పాలన అప్పగిస్తే నీళ్లు, కరెంట్ తెచ్చి చూపిస్తం
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
తెలంగాణ వస్తే చీకట్లు అలుము కుంటయ్… చుక్క నీరు దొరుకదన్న రేవంత్ గురువుల వ్యాఖ్యలను పటాపంచలు చేస్తూ తెలంగాణకు సరిపడానే కాకుండా అదనంగా నీళ్లు, కరెంటు తెచ్చిన ఘనత కేసీఆర్‌ది.. అలాంటిది మూడేండ్ల పాలనలోనే గురువుల మాటలను నిజం చేస్తూ ..వచ్చిన కరెంటును, తెచ్చిన నీళ్లను రేవంత్‌రెడ్డి మాయం చేస్తున్నడు.
-మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : నేటి కరువు ప్రకృతినుంచి వచ్చింది కాదని.. కేవలం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే వచ్చిన కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఆయన సహచర మం త్రులు స్కామ్‌ల కోసం కరెంటును పోగొడుతున్నారని, గురువు కోసం నీళ్లను ఏపీకి ధారాదత్తం చేశారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
విద్యుత్ విషయంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రం ఏర్పాటైతే ఈ ప్రాంతంలో విద్యుత్తు ప్రాజెక్టులు లేనందున తెలంగాణలో చీకట్లు అలుముకుంటాయని.. ఊర్ల్ల జనం కూలికి పోయేందుకుకూడా పని దొరకదన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి సీఎం కేసీఆర్ ఆరు నెలలు తిరగకముందే దేశమే నివ్వెరపోయేలా, విదేశాల్లోని పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా కరెంట్ వెలుగులు తెచ్చారని గుర్తుచేశారు. 24 గంటల కరెంట్‌తోపాటు 20 లక్షలకు పైగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు నిమిషం కూడా కరెంట్ పోకుండా ఇస్తే.. ఈ కాంగ్రెస్ కరెంట్ ఎందుకు ఇస్తలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు.
ఇవ్వాళ వనరులు లేక కరెంటు పోతలేదని.. కేవలం స్కామ్‌లు చేసేందుకు కుట్రలకు దిగి కరెంటును ఇస్తలేరని దుయ్యబట్టారు. సింగరేణి ప్రభుత్వ సంస్థ అయినందున కమిషన్లు రావని.. దానిని పండబెట్టి ప్రైవేట్ బొగ్గు గనుల నుంచి బొగ్గు కొనుగోలు చేస్తే కమిషన్లు తెచ్చుకోవచ్చని సింగరేణిని పండబెట్టేందుకు దారులు వేశారని ఆరోపించారు. విద్యుత్ విషయంలో ఉద్యోగుల తప్పిదం లేకున్నా వారిని బలిచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు చేతకాకుంటే బీఆర్ఎస్కు అధికారం అప్పగించాలని తెలిపారు. వెంటనే నీళ్లు, కరెంటు పునరుద్ధరణ చేసి చూపిస్తామని చెప్పారు. ఎల్ నినో సమస్య ఉన్నా కృష్ణమ్మ, గోదావరి నదుల్లో నీళ్లున్నాయని, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి మన నీళ్లను తరలించడం గురువుకు దక్షిణ కాదా? అన్ని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

