
న్యూఢిల్లీ, జనవరి 27: ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అసమానతల్ని తగ్గించడం, కొత్త ఉద్యోగాల్ని సృష్టించడంపైనే వచ్చే కేంద్ర బడ్జెట్ దృష్టిపెట్టాలని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. ‘ప్రతీ బడ్జెట్‌కూ వృద్ధిని పెంచడమే లక్ష్యంగా ఉంటుంది. అలాగే ఇది (2022-23 బడ్జెట్) కూడా ఉండాలి. కానీ ఆర్థిక అసమానతల్ని తగ్గించే ప్రతిపాదనలపై ఇందులో ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అంటూ సుబ్బారావు వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు బడ్జెట్ ప్రతిపాదనల్ని సమర్పించనున్న నేపథ్యంలో సుబ్బారావు ఈ వ్యాఖ్యలు చేశారు. వివరాలివీ..