Duvvuri Subbarao | హైదరాబాద్: ఓటర్లకు తాయిలాలు లేదా ఉచితాలపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తేవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ డీ సుబ్బారావు అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఉచితాల విషయంలో రాజకీయ పార్టీలను కట్టడి చేయడం ఎలా? అనే అంశంపై సమగ్ర చర్చ జరగాలన్నారు. ఇటువంటి పథకాల వల్ల కలిగే లాభనష్టాల గురించి ప్రజలకు మరింత అవగాహన కలిగించాలని చెప్పారు.