దేశాన్ని గట్టెక్కించిన పీవీ

- ఎమ్మెల్సీ వాణిదేవి వెల్లడి
- పీవీ తరఫున శాంతిదూత్ అవార్డు స్వీకరణ
అంబర్పేట, అక్టోబర్ 23ః దేశాన్ని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నుంచి కాపాడిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఎమ్మెల్సీ సురభివాణిదేవి నివాళులు అర్పించారు. ఆయన తరఫున భారత్ శాంతిదూత్ అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యానగర్లోని హిందీ మహావిద్యాలయంలో శనివారం భారత్ శాంతిదూత్ అవార్ట్స్-2021 కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సురభివాణిదేవి మాట్లాడుతూ.. బహుభాషా కోవిదుడైన పీవీ శాంతి కాముకుడని చెప్పారు. ఆయన కూతురునైన తనకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పీవీ శత జయంతి వేడుకలను కేసీఆర్ ఘనంగా నిర్వహించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డైరెక్టర్ ఎంనాగేశ్వరరావు, సొసైటీ గౌరవ అధ్యక్షుడు అంపశయ్య నవీన్ మాట్లాడారు. వాణిదేవితో పాటు తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు, బ్రిగేడియర్ గణేశం, సురేంద్ర లూనియా, దీపక్ భట్టాచార్యలకు భారత శాంతిదూత అవార్డులను అందించారు. సొసైటీ అధ్యక్షుడు ఎండీ సిరాజుద్దీన్, ప్రొఫెసర్ సురేష్లాల్, ప్రొఫెసర్ నరసింహమూర్తి, భూపతిరాజ్, నిమ్మల శ్రీనివాస్, శ్రీపాద సుధాకర్, శనిగరపు రాజమోహన్, జెల్లంకొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

