తుంగతుర్తి, డిసెంబర్ 29 : అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సోమవారం పరామర్శించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఈఈ తీపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి యమునమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం తుంగతుర్తి మండల కేంద్రంలో బాషా మేనకోడలు షాభిన ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే బండరామారం గ్రామానికి చెందిన యూత్ అధ్యక్షుడు చల్లా సాయి తాత చల్లా సాయిలు ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మాజీ వైఎస్ ఎంపీపీ మట్టిపల్లి శ్రీశైలం, దొంగరి శ్రీనివాస్, మట్టిపెల్లి వెంకట్, గునిగంటి సంతోశ్, గొపగాని రమేశ్, శ్రీనివాస్, సాయికిరణ్, నరేశ్, వెంకటేశ్, వెంకన్న పాల్గొన్నారు.