OTT Movies | న్యూ ఇయర్ & సంక్రాంతి స్పెషల్‌గా సినిమా హంగామా.. థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న మూవీస్ ఇవే!
OTT Movies | కొత్త సినిమాలు ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లోనే కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, సినిమా ప్రియులకు మాత్రం డబుల్ ట్రీట్ అందుబాటులోకి వస్తోంది. కొత్త ఏడాది ఆనందం , సంక్రాంతి పండగ కూడా రానుండటంతో, థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు సినిమాలతో కళకళలాడబోతున్నాయి.
OTT Movies | కొత్త సినిమాలు ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లోనే కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, సినిమా ప్రియులకు మాత్రం డబుల్ ట్రీట్ అందుబాటులోకి వస్తోంది. కొత్త ఏడాది ఆనందం , సంక్రాంతి పండగ కూడా రానుండటంతో, థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు సినిమాలతో కళకళలాడబోతున్నాయి.
సంక్రాంతికి రెడీ అవుతున్న భారీ సినిమాలు
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు ఆసక్తికరమైన చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’, చిరంజీవి – వెంకటేష్ కలిసి నటిస్తున్న ‘మన శంకర ప్రసాద్ గారు’, నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఓ రాజు’, రవితేజ హీరోగా తెరకెక్కిన ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఈ చిత్రాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ వారం థియేటర్లలోకి రానున్న సినిమాలు ఏంటనేది చూస్తే.. కొత్త ఏడాది సందర్భంగా ఈ వారం కూడా థియేటర్లలో పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సైక్ సిద్ధార్థ్, ఫెయిల్యూర్ బాయ్స్, ఇట్స్ ఓకే గురు, ఇక్కిస్, ఘంటశాల, నీలకంఠ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. చిన్న సినిమాలైనా సరే, కంటెంట్ పరంగా ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ ఆశిస్తున్నారు.
ఈ వారం రీ రిలీజ్‌ల రూపంలోనూ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ దక్కబోతోంది. వెంకటేష్ హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’ , మహేష్ బాబు మురారి సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలను మళ్లీ పెద్ద తెరపై చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
ఓటీటీలో అలరించనున్న సినిమాలు & సిరీస్‌లు
థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకుల కోసం ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా ఈ వారం మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో
ఎకో – డిసెంబర్ 31
స్ట్రేంజర్ థింగ్స్ 5 (తెలుగు డబ్బింగ్) – జనవరి 1
లుపిన్ 4 (వెబ్ సిరీస్) – జనవరి 1
హక్ (హిందీ) – జనవరి 2
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
సీగే మీ వోస్ – జనవరి 2
జియో హాట్‌స్టార్‌లో
ది కోపెన్‌హెగెన్ టెస్ట్ – ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది
సన్‌నెక్ట్స్‌లో
ఇతిరి నేరమ్ – డిసెంబర్ 31
మొత్తానికి, కొత్త ఏడాది ఎంట్రీతో పాటు సంక్రాంతి సందడి ముందే మొదలైపోయింది. థియేటర్లలో కొత్త సినిమాల హడావిడి, ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాల వరుస రిలీజ్‌లతో మూవీ లవర్స్‌కు ఇది పండగల సీజన్‌లా మారబోతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

